గోవులో దేవతలు

గోక్షీరములో చతుర్బా ముద్రాలుంటాయి. ఆవు కొమ్ముల చివరి భాగంలో మూడు కోట్ల యాభై లక్షల తీర్ధాలు ఉంటాయి. ఆవు మొదటిలో శివుడు ఉంటాడు.కనుక శివ నామాలు కానీ, బిల్వ దళాలతో కానీ, మల్లెపూలతో కానీ పూజిస్తే ఈశ్వరుణ్ణి పూజించిన ఫలితముంటుంది. గోవు నాసికలో సుభ్రమణ్యస్వామి ఉంటాడు.అక్కడ పూజిస్తే చెవి సమస్యలు రావు. సంతానప్రాప్తి, ఆవు చెవియందు అశ్వినీ దేవతలు ఉంటారు.వాటిని పూజిస్తే నేత్ర సంబంధ వ్యాధులు రావు, సకల సంపదలూ లభిస్తాయి. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉంటాడు.దానిని పూజిస్తే శీఘ్ర సత్సంతానం కలుగుతుంది.
ఆవు హుంకారంలో సరస్వతీ దేవి ఉంటుంది.అక్కడ పూజిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది.ఆవు గందస్థలంలో కుడి భాగంలో యముడు,ఎడమ భాగంలో ధర్మదేవతలు ఉంటారు. వాటిని పూజిస్తే యమబాధలు ఉండవు.ఆవు పెదవుల యందు ప్రాత సంధ్యాది దేవతలుంటారు. వాటిని పూజిస్తే సంధ్యా సమయాల్లో చేసిన పాపాలు నశిస్తాయి. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడు.అక్కడ పూజించిన వారికి ఇంద్రియ వృద్ధి , సంతానాభివృద్ధి కలిగి, పక్షవాతాది రోగాలు దరిచేరవు. ఆవు పొడుగులో సాధ్యదేవతలు ఉంటారు. ఆ భాగాన్ని పూజిస్తే వారికి సాధ్యం కానీ పనులు ఉండవు. ఆవు నాలుగు పాదాల్లో నాలుగు పుషార్ధాలు ఉంటాయి.వాటిని పూజచేస్తే ధర్మార్ధకామమోక్షాదులు లభిస్తాయి.ఆవు గిట్టల చివర నాగులు ఉంటాయి.వాటిని పూజించిన వారికీ నాగలోక ప్రాప్తి సిద్దించి ,నాగాభయం ఉండదు.
ఆవు గిట్టల నందున గంధర్వులు ఉంటారు. అక్కడ పూజించిన వారికీ గంధర్వలోకం లభిస్తుంది. ఆవు గిట్టల పక్కభాగమందు అప్సరసలు ఉంటారు.అచట పూజచేసిన వారికీ అప్సర లోకం సిద్ధిస్తుంది. సౌఖ్య సౌదర్యాలు లభిస్తాయి.జాతక రీత్య శని దోషము కలవారు ప్రతి శనివారం నల్లని ఆవును తౌడు, పచ్చిగడ్డి సమర్పించి 9ప్రదక్షిణాలు చేస్తే శని బాధలు ఉపశమిస్తాయి.కుజదోషం ఉండి వివాహానికి ఆటంకాలు లేదా ఆలస్యం అయినా ప్రతి మంగళవారం కందులు నానబెట్టి ఆవుకు 9 వారలు తినిపించి, ప్రతివారం 9 ప్రదక్షిణాలు చేస్తే సత్ఫలితాలు పొందుతారు.
దూడలతో ఉన్నఆవును పచ్చగడ్డి మోపును గాని, తెలగ పిండి లేదా గోధుమ పొట్టు, వరి తౌడు లేదా 3 అరటి పండ్లను పెట్టిన యెడల సర్వ దేవతా స్వరూపమైన గోవు వారికి అభీష్టాలను నెరవేరునట్లు ఆశీర్వదిస్తుంది. గో ప్రదక్షణ భూ ప్రదక్షిణతో సమానము, ఆవు కుడి పక్క బ్రహ్మ ఉంటాడు.దాన్ని పూజించే వారికీ సంతాన భాగ్యం కలుగుతుంది.ఆవు ఎడమ పక్క శ్రీ మహావిష్ణువు ఉంటాడు.అక్కడ పూజిస్తే జ్ఞాన మోక్షాలు కలుగుతాయి.
గోవు అపానంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుంది.గోవు పిరుదుల యందు పితృదేవతలు ఉంటారు.గోవు వక్షస్థలములో ఉమాదేవి కొలువై ఉంటుంది. గోవు నాభినందు రుద్రుడు, గోవు తోక యందు మన్మధుడు, జంఘాల యందు గణపతి ఉంటాడు.అందుకే ముక్కోటి దేవతలు నిలయమైన గోవు సర్వదా పూజ్యనీయము.

bhakthitoday Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *