సౌభాగ్య చిహ్నం కుంకుమ

మంగళప్రదాయినిగా, సౌభాగ్యానికి చిహ్నంగా కుంకుమను పేర్కొంటారు. మహిళలకు కుంకుమ పట్ల వల్లమానిన ప్రేమ, మక్కువ ఉంటుంది.దీనిని శుభ సూచికంగా, అతి పవిత్రంగా వారు భావిస్తుంటారు. భారతీయ మహిళలకు నుదుట కుంకుమ ఉంటే చాలు నిండు దనం వస్తుంది. భారతీయత ఉట్టిపడుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగేటపుడు లేదా పండుగల సమయంలోను ప్రతి శుక్రవారం కూడా గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం హిందూ సంప్రదాయంగా వస్తున్నది. ఇది అనవయతీ కూడా, ప్రాచీన కాలం నుండి ఈ సంస్కృతి, సంప్రదాయాన్ని కొనసాగిస్తునారు.

భారతదేశంలో కుంకుమకు ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విలువ దేనికి లేదంటే అతిశయోక్తి కానేకాదు. శుభకార్యం చేస్తున్నపుడు, నోములు, వ్రతాలు పేరంటాలకు ముతైదువులు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోయే సమయంలోను వారికి సంప్రదాయబద్దంగా నుదుట కుంకుమ బొట్టు పెట్టి సాగనంపుతారు. పూజకు పుష్పాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా ఎంతో అవసరం. అక్కడ వాటికున్న ప్రాధాన్యత అలాంటిది. పూజల్లో కుంకుమతో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
నోముల్లో కుంకుమకు ప్రాధాన్యత ఉంది. ఉదయ కుంకుమ అనే వ్రతం ఒకటి ఉంది. ఆ నోమును ఆచరించినవారు సూర్యోదయం ముందుగా ప్రతి రోజు ఒక సౌభాగ్యవతి నుదిటిన కుంకుమ బొట్టు పెటాలి. ఇలా ఒక సంవత్సరం పాటు చేస్తారు, మహిళ నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం అన్నది అలంకారంగాను, ముఖ సౌందర్యానికి, ఆకర్షణకు గాను, సౌభాగ్యానికి గాను చిహ్నంగాను ఉంటుంది. ఆడపిల్లలకు పుట్టుకనుండే నుదిటిన కుంకుమ పెట్టుకునే హక్కు వస్తుంది. పుట్టుకనుండే సంక్రమించిన నుదిటి బొట్టును భర్త చనిపోతే ఎందుకు తీసేయాలనేది నేటి ఆధునికులే కాదు, నాటి సంఘసంస్కర్తలు కందుకూరి, రాజారామ్ మోహన్ రాయ్ లాంటి వారు ఖండించారు కూడా.
నుదిటిన బొట్టు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక నేపద్యం ఎంతో ఉంది. ప్రతి వారికీ నుదిటిన బ్రహ్మ దేవుడు మూడు గీతలతో దేవలిపిని రాస్తాడనీ, ఆ విధంగా బ్రహ్మ దేవుడు రాయబడిన లిపి సరస్వతిదేవి ప్రతి రూపమని భావిస్తారు . వివాహిత నుదిటిన లేకపోతే భర్తకు కీడు అని, పాపిట్లో కుంకుమను పెట్టుకుంటే ఆ కుంకుమ భర్తను గండాల నుండి రక్షిస్తుందని చాల మంది వివాహితులు నమ్ముతారు. నేటి తరుణంలో చాలా మంది నుదిటిన కుంకుమ బొట్టుకు బదులుగా తిలకాన్ని దిద్దుకున్తునారు.
తిలకం ఎన్నో రంగులతో తయారవుతుంది. తాము ధరించిన దుస్తులకు, గాజులకు అనుగుణంగా అదే రంగు ధరించిన దుస్తులకు, గాజులకు అనుగుణంగా అదే రంగు తిలకాన్ని కూడా కొంత మంది అమ్మాయిలు పెట్టుకుంటారు. తిలకమే కాకుండా నుదిటిన అతికించుకునే బొట్టు బిళ్ళలను వాడుతున్నారు.
పూర్వ రాజులు యుద్ధరంగానికి బయలుదేరే సమయంలో వారి పత్నులు నుదిటిన తిలకాన్ని దిద్ది, యుద్ధానికి పంపేవారని తెలుస్తుంది. పండుగల్లో కానీ, శుభ సందర్భాల్లో కానీ కొత్త బట్టలు మొదటి సరిగా ధరించాబోయే ముందు ఆ దుస్తులకు కుంకుమను పెట్టి ఆ తరువాత ధరించే పద్దతిని అమలుపరుస్తున్నారు.
ఏదయిన దేవాలయానికి వెళ్ళిన, పుణ్యక్షేత్రానికి వెళ్ళిన అక్కడి కుంకుమను చిన్న పొట్లంలో ఇంటికి తేచుకొని నిద్రించే ముందుకు నుదిటిన పెట్టుకొని చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయడం వాళ్ళ చెడు కలలు రావని, ఎలాంటి దుష్ట శక్తులు దగ్గరకు రావని వారి నమ్మకం. అంటే కుంకుమలో అంతటి ఆద్యాత్మిక శక్తి దాగివుందన్నమాట.
నుదిటి కుంకుమతో కనిపించే మహిళకు ఎంతటి నిండు దనాన్ని ఇస్తుందో , అదే స్థాయిలో గౌరవ మర్యాదలు కూడా కల్పిస్తుంది. కుంకుమలో ఉన్న గొప్పదనం అదే. అందుకే యుగాయుగాలుగా కుంకుమను శుభ సుచికంగా భావిస్తున్నారు. మంగళ ప్రదంగా ఆరాధీస్తునారు. కళ్ళకు అద్దుకుని నుదిటిన ధరిస్తే చాలు అమంగాళాలన్న పటాపంచాలవుతాయని మహిళల నమ్మకం.
ప్రాచీన కాలంలో ఆర్యులు కుంకుమ ప్రముఖ్యతను గుర్తించారు.భార్య నుదిటి కుంకుమ అతని పరాక్రమానికి, ధైర్యానికి గుర్తుగా భావిస్తారు. రణరంగానికి వెళ్ళే రాజపుత్ర యోధునికి భార్య తన రక్తంతో నుదిటి బొట్టు పెట్టి పంపుతుంది. అనివార్య పరిస్థితుల్లో భర్త యుద్దరంగంలో మరణిస్తే తను రక్త తిలకం అలంకరించుకొని సహగమనం చేస్తుంది. కుంకుమను నుదిటిన గుండ్రంగా పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ప్రకాశవంతమైన ఎర్రని సూర్యబింబంలా భర్తకు పూర్ణాయుర్దాయాన్ని కలుగచేయాలని తన నుదుట కుంకుమ చిరకాలం నిలిచి ఉండేట్లు  చేయమని స్త్రీ భగవంతుడిని ప్రార్థిస్తుంది.
  – by bhakthitoday.com team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *