ప్రత్యేకతల సమాహారం మహానంది

కర్నూలు జిల్లాలో నేలవైవున్న ఈ మహానంది క్షేత్రం భక్తుల కోవెలగా వర్ధిల్లుతోంది. ఎనిమిది నందులతో భక్తులను అశేషంగా ఆకట్టుకుంటున్న ఈ క్షేత్రం అనేక విశేషాలు, వింతలను కలిగివుంది. ప్రధమ నంది, నాగానంది, వినాయక నంది, శివానంది, సూర్యనంది,విష్ణు నందిన, సోమనంది అనే ఎనిమిది నందీశ్వర క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి.ఈ నవనందీశ్వర ఆలయాలు ప్రాచీన చాళుక్యుల కాలం నాటివని కొందరు చెబుతారు.
మహా నందీశ్వరాలయానికి చుట్టూ తిరుచుట్టు మాళియ అనబడే చుట్టు మండపం ఉంది. మధ్యలో కల్యాణ మండపాదులు ఉన్నాయి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్తు అమలక శిలతో శిఖరం వలే వేరు చేయబడింది. అన్ని అంతస్తులు కూడి మహా విమానమేర్పడి వుంది. ఆలయంలో స్వామి వారిని అభిషేకించిన జలం బయటకు రాకుండా లింగం కింద నుండి ఎల్లవేళలా బుగ్గవాలే నీటి ప్రవాహం వస్తుంటుంది.వాటిని మూడు కుండముల గుండా వెళ్లే ఏర్పాట్లు చేశారు. మనం ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే స్వచ్ఛమైన నీటితో నిండిన రుద్ర కుండం ప్రధాన ఆలయానికి ముందుపు వైపున కనబడుతుంది. దీని చుట్టూ రాతితో ప్రకారం కట్టారు.తూర్పు వైపున అమర్చిన నంది నోటిలో నుండి నీరు ఈ కుండంలోకి ప్రవేశిస్తుంది. వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు ఆడతారు.ఇక్కడి నుండి తూముల గుండా నీరు బయటికి వచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది.యాత్రికులు బయటి ఆలయ ప్రహరీ ముఖద్వారం నుండి పెద్ద చెట్లతో వున్న విశాలమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న ఆలయ మండపానికి వెళ్లే దారికి ఇరువైపులా ఈ బ్రహ్మ , విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ నీరు అడుగున వున్న నేల చాలా స్వచ్ఛముగా ఉంటాయి. అంత తేటతెల్లగా ఉంటుంది ఇక్కడి నీరు. ఈ నీరు అక్కడి నుండి కలువుల ద్వారా అరటితోటలకు, పంట పొలాలకు ఉపయోగపడుతుంది. ఈ నీటి ద్వారా రెండు వేల హెక్టర్ల మేరకు పంట భూములు సస్యశామలమవుతాయి.
ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు.అదేమంటే గర్భాలయానికి పక్కన ఒక శిలామండపం ఉంది.అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్తంభాలపై గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరాగాంధీ, ప్రతిమ జవహర్ లాల్ నెహ్రు ప్రతిమను చెక్కి తన దేశభక్తిని కూడా చాటుకుంటున్నారు.
ఆలయం చుట్టూ కొలువై ఉన్న నవ నందులను దర్పిస్తే సర్వపాపాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం లో సోమవారం రోజున ఈ నవనందులను దర్మించడం ద్వారా జన్మజన్మల నుండి వెంటపడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటిని దర్శిస్తే అన్ని దోషాలు తొలిగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం.14 వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణం జరిగిందని పురాణాలూ చెబుతున్నాయి.వీటిని దర్షించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ప్రధమ నందీశ్వరుడు, నగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో శివ నందీశ్వరుడు ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణ నంది, నంద్యాల మహానందికి వెళ్లే దారిలో కుడివైపు తమ్ముడపల్లె గ్రామ సమీపంలో సూర్య నందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం కంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *