మెట్టెలు, నల్లపూసలు ఎందుకు?

హిందూ వివాహా సంప్రదాయాల ప్రకారం వివాహితకు మెడకు తాళిబొట్టు, నల్లపూసలు, కాలికి మెట్టలు అత్యంతావశక్యం. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్దం పడతాయి. తరాల నుండి వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను హిందూ వివాహ వ్యవస్థలో ఆచరిస్తూనే వస్తున్నాం, వాటి అర్థం పరమార్ధం గురించి తెలుసుకుందాం.
మన వివాహ వ్యవస్థలో మనం పాటించే సంస్కృతి సంప్రదాయాల వెనుక ఎంతో అర్థం పరమార్థం ఉంది.ఒక్కొక్క దానికి ఒక్కోప్రాధాన్యత ఆవశ్యకత మిళితమై ఉంది. ప్రతి సంప్రదాయం మనకు రక్షణగా నిలుస్తుంది. మన ఆలోచనలను అది ప్రభావితం చేస్తుంది. మన వ్యవహారశైలిని ప్రతిబింబిస్తుంది. అంతటి శక్తి మహత్తు ఇందులో మిళితమై ఉంది. వధువు మెడలో వరుడు మూడు ముళ్ళు వేయగానే వివాహతంతు ముగుస్తుంది. మంగళసూత్రం,నల్లపూసలు,కాలికి మెట్టెలు జీవితాంతం ఆమెకు వెన్నెంటే ఉంటాయి.ఎంతో పవిత్రంగా వాటిని కాపాడుకుంటూనే ఉంటుంది. వాటిని ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హిందువైన ప్రతి వివాహిత వాటిని తప్పక ధరిస్తుంది.అలా ధరించిన మహిళకు సమాజంలో ఇతరుల నుండి గౌరవ, మర్యాదలు లభిస్తాయి. మన ఆచార, సంప్రదాయాలకు ఉన్న స్థానం అలాంటిది. అందుకే భారతీయ వ్యవస్థ పట్ల ప్రపంచ వ్యాహితంగా ప్రత్యేక స్థానం కల్పించబడింది. ఇది ఎప్పటికి ఉండేలా పరిరక్షించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉంది. మన ధర్మాలలో ఆచారాలలో మంచి ఆలోచన ఉంది. మన శాస్త్రాల్లో సంప్రదాయాలలో మంచి సిద్దాంతం ఉంది.వివాహానంతరం యువతి గృహిణిగా మారుతుంది.కుమారి స్థానం పోయి శ్రీమతి అవుతుంది.అర్ధాంగిగా రూపాంతరం చెందుతుంది.తనలోని సగభాగం భర్తకిచ్చి భర్తలోని సగభాగం తాను పొందుతుంది.
కుమారిగా తండ్రి యింట ఉన్నపుడు ఎవరితో మాట్లాడినా ఎవరిని చూసి నవ్వినా ఎవరితో స్నేహం చేసినా చిన్నతనంగా చెల్లిపోతుంది.వివాహిత స్త్రీకి ఎన్నో అడ్డుకట్టలున్నాయి. గృహిణి ధర్మం కత్తిమీద సామువంటిది. మంచి చెడులు తెలియాలి.చేయదగినదేదో చేయకుడనిదేదో తెలుసుకోవాలి. మాట నేర్పరితనంతోపాటు మంచితనం జతచేయాలి.పరపురుషుల విషయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. తన ఇంటి గుట్టు తల్లిదండ్రులతో కూడా చెప్పకూడదు.అత్తింటి బంధువులను గౌరవించాలి.అందరికి తల్లిలాగ ఉండాలి. తలలోని నాలుకలా అందరిని ఆకట్టుకోవాలి.సహనం నేర్చుకోవాలి.శాంతమూర్తి కావాలి.గృహిణికి మరొకటిలేదు గృహధర్మమే గృహిణికి ముక్తి మోక్షాలనిస్తుంది.
గృహిణికి కాలిమెట్టలు ఎందుకు?
నల్లపూసలు మంగళసూత్రం ఎందుకు ధరించాలి?

పరపురుషులు తలవంచి చూచినా తలెత్తి చూసినా ఆమెగృహిణి అని మరొకరికి స్వంతమనీ ఇంకొకరి అర్ధంగిగా జీవిస్తున్నదాన్నీ వీటిని ధరించడం ద్వారా అందరికి తెలుస్తుంది. అందువల్ల ఆమెకు కామదృష్టితో చూడరాదనీ హాస్యోక్తులు పలుకరాదని అందరికి ఆమె మాతృ సమానురాలని గౌరవనీయదృష్టితో ఆమెను చూడాలని సోదరి భావంతో ఆమెతో మసలుకోవాలని మానసికంగా గాని మాతాపూర్వకంగా గని క్రియా పూర్వకంగా గాని ఆమెను మాతృభావంతో చూడాలని పూర్వికులు గృహిణికి ఈ అలంకారాలు ఇచ్చారు. ముఖం చూడగానే నల్లపూసలు కనిపించాలి.గుండెలు చూడగానే మాంగల్యం కనిపించాలి. చీర అంచులను చూడగానే కాలిమెట్టలు కన్పించాలి. పరపురుషులు గృహిణిని కామదృష్టితో చూడదలిచినా ఈ వస్తువులు కనిపించగానే వికారం తగ్గిపోతుందనే సంస్కారభావంతో పెద్దలు ఈ పద్దతిని రూపొందించారు. 2 వేల ఏళ్ళ క్రితం మనకు మాంగల్యం లేదు.కలియుగ ధర్మప్రకారం కలిప్రభావానికి భయపడి ఈ ఆచారాలను పూర్వీకులకు కల్పించారు. ఆ ఆలోచనే ఆచరమయింది.మన పెద్దల మేధోశక్తికి ఎన్ని వందనాలు చేసినా రుణం తీరదు గదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *