భగవంతుని ఆరాధన

సృష్టిలోని వైవిద్యాన్నీ, మనషుల  జీవితాలను బొమ్మలుగా చేసి విధి ఆడే వింతనాటకాన్ని  గమనించిన తరువాత భగవంతుడి మీద  నమ్మకం  కలగకమానదు.  ఆ నమ్మకం  లేనివాళ్లు  యెవరో  కొంతమంది  ఉండవచ్చు.  భగవంతుడి మీద విశ్వాసం   ఉన్నవాళ్ళందరూ భగవంతుడిని ఆరాధిస్తూనే వుంటారు. ఆ సర్వాంతర్యామిని ,సర్వశక్తివంతుడిని  ఆరాధించేందుకు అనేక మార్గాలున్నాయి.

భగవంతుడిని ఆరాధించేందుకు హిందువులలో అత్యధికులు పూజావిధానాన్ని అవలంభిస్తారు . పూజకు  ఆధ్యాతికచింతన పునాదిగా  ఉండాలి .కానీ మొక్కుబడులు  యెక్కువకాటమూ, మనుషులు  ధనవంతులు  కావటమూ జరిగిన  తరువాత  పూజలో  ఆధ్యాతికచింతన తగ్గి  ఆడంబరూలూ, అట్టహాసాలు యెక్కువ కొనసాగినాయి. పూజామండపాల అలంకరణ, విందు, వినోదాలూ, కానుకలు  యిచ్చిపుచ్చుకోవటాలూ మాత్రమే  ‘పూజ’  అయ్యింది. ఈ పరిస్థితి  ఈనాడు  యోర్పడ్డది  కాదు .పద్నాలుగవ శతాబ్దంలోనే  యోర్పడ్డది.

భగవంతుడిని పుష్పాలతో పూజించటం సర్వసాధారణమేనా విషయము . కొంతమంది  తామరలు, కలువలు, సంపెంగలు, మందారాలు, గులాబీలు మొదలైన విలువైన  పూలతో పూజిస్తారు. కానీ భగవంతుడికి కావలసినది ఆవిధమేన పూజ కాదంటాడు  అన్నమయ్య. అంతేకాదు, భగవంతుడిని పూజించేందుకు భౌతికమైన పూలు  అవసరమేలేదని అయన అభిప్రాయం.

భగవంతుడి మెప్పును పొందే  పూజకు  కావలసిన మొదట  పుష్పము, సత్యభాషణ. సకల  సద్గుణాలకు మూలం అదే. సత్యభాషణ వలన యెవరికి కష్టంగాని ,నష్టంగాని  జరగదు . సత్యాన్ని చెప్పటంవలన మనిషి యొంతో మనశ్శాంతిని పొందుతాడు . అందువలననే  సత్యభాషణకు మొదటి ప్రాధ్యానత్త యివ్వబడినది.

విలక్షణమైన పూజకు  కావలసిన  రెండవపుష్పము  దయాగుణము. సత్యభాషణ ,దయాగుణము రెండు జంటస్వభావాలే. రెండింటి వలనా ఒకే విధమైన ప్రయోజనాలు  కలుగుతాయి. దయాగుణము విశాలమైన  హృదయం కలిగివుండటానికి దోహదపడుతుంది . మనసును పగ, ద్వేషమూ, దుష్టచింతన వంటి  పాప చింతనలకు దూరం చేస్తుంది .
సత్యభాషణ, దయాగుణము, ఏకాగ్రత అనే ఈ మూడు పుష్పలతోను భగవంతుడికి అర్పించే భక్తుడి భక్తి  ప్రకాశిస్తుందని ఈ పద్యంతో చెప్పబడ్డది. .’ప్రకాశం’ జ్ఞానానికి చిహ్నం. ఆ భక్తుడి మనస్సు లోని భక్తి భావం పూర్తిగా పరిపక్వమవుతుంది. పరిపక్వమైన భక్తి జ్ఞానంగా పరిణమిస్తుంది. ఈ త్రివిధ పుష్పలతోనూ చేసే పూజ మాత్రమే భగవంతుడికి ప్రీతిపాత్రమవుతుందనే మరొక యధార్థ విషయాన్నీ కూడా తెలియ చేశాడు అన్నమయ్య.

కవులల్లో అగ్రగాన్యుడైన పోతనామాత్యుడు భాగవతాదికలోని
“చేతులారంగ శివునిబూజింపడేని నోరు నోస్సంగ హరికిర్తినుడువడేని
దయయుసత్సంబు లోనుగా దలబపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు” అనే పద్యంలో వివరించాడు.
దయనూ, సత్యాన్ని ఎప్పుడు మనస్సులో ఉంచుకోవాలంటాడు. ఆ రెండిటిని మనస్సులో ఉంచుకున్న మనిషి తప్పకుండా పరిపక్వమైన భక్తి భావం కలిగిన జ్ఞాని అవుతాడు. అతువంటి జ్ఞాని అయిన భక్తుడి గుండె మరొక లక్షణాన్ని ఈ పద్యంలో పోతన వివరించాడు. అందరూ దేవతలను సమదృష్టితో చూడటమే ఆ లక్షణం. అటువంటి భక్తుడు చేతుళారంగ శివుడిని పూజ చేస్తాడు. నోరు నొప్పి పుట్టే విధంగా హరిని స్తుతిస్తాడు. పద్యంలో శివకేశవులను  సమానంగా పూజించటం మాత్రమే చేపబడినప్పటికి సర్వదేవ సమానత్వం అనే అర్థం చేసుకోవాలి.

   – శివ ప్రసాద్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *