ఆకాశ క్షేత్రం చిదంబర ఆలయం

దక్షిణాది ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. పరమేశ్వరుడు కొలువైవున్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రము లో వుంది. పురాణగాధలను అనుసరించి శివుడు ‘ఓం’ మంత్రాక్షరం తో  చిదంబరం లో  కొలువై ఉన్నట్లు చెప్పబడింది. అందువల్లనే శైవులకు ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రీతిపాత్రమైంది. పరమేశ్వరునికి సంబంధించిన ఐదు ప్రసిద్ధ క్షేత్రాలలో చిదంబరం ఒకటి. ఈ ఆలయాన్ని భక్తులు శివుని ఆకాశ క్షేత్రముగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిని వాయువుగాను, కాంచీపురం లోని దేవాలయాన్ని పృధ్విగాను, తిరువానికిలో వున్నా ఆలయాన్ని నీరుగాను, తిరువణ్ణామలైలో కొలువైవున్న అరుణాచలేశ్వర ఆలయం నిప్పుగాను భావిస్తారు. ఈ ఆలయాన్ని అగ్నిమూల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎక్కడ భక్తులకు పరమేశ్వరుడు  ఓ జ్యోతి రూపములో దర్సనమిస్తాడు. దేవాలయములో ఉన్న నాలుగు అందమైన స్తంభాలు ఒక్కోటి ఒక్క దిక్కులో ఉంటాయి.
దేవాలయం లోపలి భాగములో కళానైపుణ్యం తొణికిసలాడుతుంది. ఈ దేవాలయం నాట్యానికి పుట్టినిల్లుగా గోచరిస్తుంది. ఎక్కడ ఉన్న ప్రతి రాయి, స్తంభము పై భరతనాట్య భంగిమలను తెలుపుతుంటాయి. ఎంతో నైపుణ్యంతో పరమేశ్వరుడు ఈ నాట్యాన్ని చేసాడని..అందువల్లనే ఆయనను నటరాజ స్వామిగా కీర్తించారని చెప్పబడింది. మధ్యలో శివకామ సుందరీ సమేతుడైన పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ చిదంబరుని గురించి రహస్యం ఒకటి మీరు తెలుసుకోవాలి. ఏది శైవక్షేత్రం అయినప్పటికీ  గోవిందరాజుల సన్నిధిని చూడ వచ్చును. ఎక్కడ మరో విశేషము ఏంటంటే  పరమేశ్వరుడు, గోవిందరాజులు ఒకేచోట నిలబడి ఉండటం.
చేరుకోవటం ఎలా?
చెన్నై రైల్వేస్టేషన్ నుండి చిదంబరం (చెన్నై- తంజావూరు రైలు మార్గము లో) 245 కిలోమీటర్ల దూరములో వుంది.
రోడ్డు ద్వారా 4 లేదా5 గంటల్లో బస్సు లేదా కారులో చిదంబరం చేరుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *