క‌లియుగం చివ‌రిలో జ‌రిగేదిదే!

రామచరిత మానసను అనుసరించి కలియుగంలో చేసే పాపాలు అన్ని ధర్మాలను క్షీణింప జేస్తాయి. ఆధ్యాత్మిక గ్రంధాలు కనుమరుగవుతాయి. కొంతమంది మిడిమిడి జ్ఞానం కలవారు కల్లబొల్లి కబుర్లు చెపుతూ అందర్నీ తప్పుదారి పట్టిస్తుంటారు. గోస్వామి తులసీదాసు చెప్పిన‌దానితో పాటు రామాయణం, మహాభాగవతం అనుసరించి రామచరిత మానసలోని ఉత్తరకాండ లో కలియుగ వర్ణనలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భాగవతంలో సుఖ దేవుడు కలియుగం గురించి సంపూర్ణంగా వర్ణించాడు. ఇవిమన కళ్లను తెరిపించేలా ఉన్నాయి. ఈ వర్ణనలను ఈ అనుసరించి అనుసరించి అన్నీ జరుగుతున్నాయి.

కలియుగం అంటే కాలా యుగం అందరి మనసులో అశాంతి నెలకొంటుంది. అందరూ మానసికంగా కుంగిపోయి ఉంటారు. భవిష్య పురాణంలో కలియుగం అంతం గురించి వర్ణన ఉంది. కల్కి భగవానుడు అవతరించి సత్య యుగాన్ని స్థాపిస్తాడు. అయిదు గ్రహాలైన ఐదు గ్రహాలైన మంగళ బుధ గురు బృహస్పతి శని రవి మేషరాశిలో జీరో డిగ్రీల వద్దకు వచ్చినప్పుడు కలియుగం ప్రారంభమైంది. ప్రస్తుతం కలియుగం లోని ప్రధమ పాదం నడుస్తోంది. మన పురాణాల్లో కలియుగం ఎలా ఉంటుంది అది ఎలా వ్యాపిస్తుంది అది ఎప్పుడు అంతం అవుతుంది అనే విశేషాలు ఉన్నాయి కలియుగంలో మనుషులకు ఒక నెలరోజులు పెద్దలకు ఒక్కరోజు మరియు రాత్రితో సమానంగా ఉంటుంది మనుషులకు ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుగా ఉంటుంది. మనుషులకు 30 రోజులు అయితే అదే దేవతలకు ఒక నెలతో సమానంగా ఉంటుంది. కలియుగం వ్యవధి 12 వేల సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. దీని ప్రకారం కలియుగం 4 లక్షల 32 వేల సంవత్సరాల పాటు కలియుగం నడుస్తుందని తెలుస్తోంది. దీని ప్రకారం కలియుగంలో ఇప్పటివరకు 5118 సంవత్సరాలు గడిచాయి. ఇంకా నాలుగు లక్షల 26 వేల 882 సంవత్సరాలు మిగిలి ఉంది . కలియుగంలో మనుషులకు 32 వేల సంవత్సరాలు దేవతలకు 200 సంవత్సరాలతో సమానం. ద్వాపరయుగంలో మనుషులకు 8 లక్షల 64 వేల సంవత్సరాలు వాళ్లకు 2,400 సంవత్సరాల తో సమానం. త్రేతాయుగంలో ఒక కోటి 29 లక్షల 6 వేల సంవత్సరాలు మూడు వేల ఆరు వందల సంవత్సరాలతో సమానం. మొత్తంగా చూస్తే కలియుగంలోని మనుషులకు నాలుగు కోట్ల 32 వేల సంవత్సరాలు దేవతలకు12 వేల సంవత్సరాల తో సమానం.

కలియుగం చివరిదశలో ముందుగా మనుషుల ఆయుస్సు 20 సంవత్సరాలకు తగ్గుతుంది. అయిదేళ్ల చిన్న వయసులోనే మహిళ గర్భం దాలుస్తుంది పదహారేళ్లకే మనిషి వృద్ధుడు అయిపోతాడు. ఇరవై ఏళ్లకే మృత్యువు ప్రాప్తిస్తుంది మనిషి శరీరం చాలా బలహీనంగా మారుతుంది బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి మనిషి వయస్సు చాలా తగ్గిపోతుంది. అన్ని ప్రాణుల శరీరాలు క్షీణించి చిన్నగా మారిపోతాయి ఆ సమయంలో కల్కి భగవానుడు ఉద్భవిస్తాడు అప్పుడు మనుషుల సగటు వయస్సు 20 ఏళ్లుగా ఉంటుంది. కల్కి అవతారం ప్రారంభమైనప్పుడు నాలుగు వర్ణాల మనుషులు సూదులతో సమానం అయిపోతారు. గోమాత కూడా గొర్రెల్లాగా చిన్న చిన్నగా మారిపోతుంది. అప్పుడు తినేందుకు అన్నం అనేది దొరకదు చేపలు, మాంసాన్నే తింటారు. గొర్రె బర్రె పాలు తాగుతారు. పండ్ల చెట్లు మెల్లమెల్లగా అంతరించిపోతాయి స్త్రీలు మరింత కిలాడీలుగా మారిపోతారు. భర్తకి ఎదురు చెపుతుంటారు ఎవరి దగ్గర ధనం ఉంటుందో వారి దగ్గరే స్త్రీలు ఉంటారు. ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. సమాజంలో హింసాప్రవృత్తి పెరుగుతుంది. ఎవడు బలవంతుడో వాడే రాజవుతాడు అనుబంధాలు మాయమవుతాయి సోదరుడు సోదరుడికి శత్రువుగా మారతాడు. ఒక చెయ్యి మరో చెయ్యిని మోసం చేస్తుంది. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని చంపే స్థితికి దిగజారుతారు. తమ గొప్పలు చెప్పుకునే వారు ఎక్కువ అయిపోతారు.

కలియుగంలో మనుషులు శాస్త్రాలను విస్మరిస్తారు. అనైతిక సాహిత్యానికే మొగ్గుచూపుతారు. చెడ్డమాటలు, చెడ్డ పనులకే మొగ్గుచూపుతారు. స్త్రీపురుషులు ఇద్దరూ అధర్మాన్ని అనుసరిస్తారు. భాగవతంలోని ద్వాదశ స్కంధంలో కలియుగం ఎలా ఉంటుందనే దానిపై సూతమహర్షి… పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు. కలియుగం పెరుగుతున్న కొద్దీ సత్యం, పవిత్రత, క్షమ, ఆయుష్షు, బలం, శక్తి మొదలైనవన్నీ అడుగంటి పోతాయి. దీర్ఘకాలంపాటు కరువు కాటకాలు ఆవరించిన తరువాత కలియుగం చివరిలో మహా ప్రళయం సంభవిస్తుంది. భారీ వర్షాలు కురిసి, నలువైపులా నీటితో నిండిపోతుంది. భూమండలం మొత్తం నీటితో నిండిపోతుంది సూర్యుని వేడి తో భూమండలం మండిపోతుంది. కలియుగాంతంలో తుఫాన్లు, భూకంపాలు వస్తాయి. జనం ఇళ్లలో ఉండలేకపోతారు. జనం భూమి కింద బొరియలు తవ్వుకొని జీవిస్తారు. భూమిలోని మూడొంతుల భాగం భాగం కిందకు వెళ్లి పోతుంది. మహాభారతంలో కలియుగాంతంలో ప్రళయం వస్తుందని పేర్కొనబడింది అయితే దానిలో కలియుగాంతంలో సూర్యుడి తేజస్సు అంతకంతకూ పెరిగి సప్త సముద్రాలు అడుగంటి పోతాయని ఉంది. అగ్ని భూమండలాన్ని దహించివేస్తుంది. తర్వాత పన్నెండేళ్ళపాటు భారీ వర్షాలు కురుస్తాయి. తరువాత కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. కలియుగం పెరుగుతున్నకొద్దీ పాపాలు, ద్వేషాలు పెరుగుతూ వస్తాయి. మానవత్వం అనేది కొంతమందిలో అలాగే నిలిచి ఉంటుంది. ధర్మాత్ములైన వారు ఋషులు మునులు చెప్పే మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారు.

– నరసింహా మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *