ఆఫ్ఘనిస్తాన్‌లో పుష్పక విమానం

రామాయణం, మహాభారతంలోని కథలలోనూ వీటి ఆధారంగా రూపొందించిన సీరియల్స్‌లో ఎగిరే విమానాలను… అంటే పుష్పక విమానాల  గురించిన వ‌ర్ణ‌న‌ను వినేవుంటారు. దీని గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయి వుంటారు. రామాయణంలో పుష్పక విమానం  ప్రస్తావన వస్తుంది. రావణాసురుడు  సీతామాతను లంక కు పుష్పక  విమానం పైననే తీసుకు వెళ్ళాడు అని చెబుతుంటారు. పుష్పక విమాన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ప్రస్తావించారు. అయితే దైత్యులు, మునులు వినియోగించిన తొలి విమానాన్ని పుష్పక విమానంగా చెబుతుంటారు. వాల్మీకి రామాయణం లో లభ్యమైన కథలను అనుసరించి పుష్పక విమానాన్ని  రూపొందించే బాధ్యతను విశ్వకర్మ కు బ్రహ్మ అప్పగించాడు. దీనిని తయారు చేసిన తరువాత  ఆ విమానాన్ని కుబేరునికి అప్పగించాడు. అయితే  ఆ విమానాన్ని కుబేరుడి నుంచి రావణుడు అపహరించాడు. ఈ విమానం గొప్పతనం ఏమిటంటే దీని యజమానిగా  ఎవరైతే  ఉంటారో వారు చెప్పినట్టు అది ప్రయాణిస్తుంది. ఇది అత్యంత వేగంగా నడిచే విమానం.  శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ప్రాచీన విజ్ఞానం అనేది  ఆధునిక శాస్త్రం తో ఎంతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ విమానం ఉందన్న సంగతిని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు.
శ్రీ రాముడు… రావణుని పై విజయం సాధించిన తర్వాత ఈ విమానం మీదే అయోధ్యకు తిరిగి వచ్చాడు.దానిని పూజించిన తర్వాత తిరిగి కుబేరునికి అప్పగించాడు.  పుష్పక విమానం పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు రావణునికి సంబంధించిన అయిదు విమానాశ్రయాలను కనుగొన్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం శ్రీలంకలో అణువణువునా గాలించి వీటిని కనుగొంది.  అదేవిధంగా అశోక వాటిక పరిశోధిస్తున్న కమిటీ కమిటీ సభ్యులు చెప్పిన దాని ప్రకారం రామాయణంలో పేర్కొన్న శ్రీలంక… ఇప్పుడున్న  శ్రీలంక ఒకటే. దక్షిణ భారతంలో ప్రచారం లో వున్న రామాయణాన్ని అనుసరించి  రావణాసురుని విమానాశ్రయం కుషాన్ గూడ. హనుమంతుడు సీతామాతను  వెతుకుతున్న సందర్భంలో దీనిని కనుగొన్నాడు. తరువాత దాన్ని ధ్వంసం చేశాడు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి పుష్పకవిమానం  నెమలి ఆకృతిని కలిగి అందంగా ఉంటుంది. ఇది అగ్ని, వాయు శక్తితో నడుస్తుంది. ఒక నివేదికను అనుసరించి ప్రాచీన భారతంలోని ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ విమానాన్ని రెండు  వేల సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక గుహలో కనుగొన్నారు . దీంతో రామాయణంలో కనిపించిన పుష్పకవిమానం ఇదేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో దీనిని కనుగొనేందుకు అమెరికా సైన్యం అణువణువునా  గాలించింది.
ఎనిమిది మంది కమాండోలు ఈ విమానం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కాంట్రవర్షియల్ వెబ్ సైట్ ను అనుసరించి ఈ ఫ్లయింగ్ మిషన్  ఆఫ్ఘనిస్తాన్‌లోని పర్వత శిఖరాల మధ్య ఉందాని వెల్లడైంది. దీనిని కనుగొనేందుకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ కు ఒక సీక్రెట్  క్రౌడ్ మిషన్‌ను పంపించింది. అయితే ఆ మిషన్ ఇంతవరకూ తిరిగి వెనక్కి రాలేదు. పురాణ గాథలను అనుసరించి ఈ విమానం ఒక స్ట్రేంజ్ ఎనర్జీ తో కూడిన  రక్షణ వ్యవస్థ కలిగి ఉంది. అందుకే  ఆ గుహలోంచి విమానాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వారంతా ఆ  టైం వీల్‌లో  చిక్కుకుపోయి మాయమైపోయారు. అదేవిధంగా ఈ విమానం రేగిస్తాన్‌లోని ఒక టైం వీల్‌లో  చిక్కుకుందని అంటుంటారు. ఇది ఆప్ఘనిస్థాన్లోని దుర్గమమైన పర్వత శ్రేణుల మధ్య ఒక గుహలో  ఉంది. ఈ కారణంగానే  ఇది ఇప్పటికి సురక్షితంగా ఉందని అంటుంటారు. అయితే ఇక్కడకు వెళ్లిన వారెవరు ఇంతవరకు తిరిగి రాలేదు. రహస్య శక్తి   ప్రభావం కారణంగానే ఇలా జరుగుతోందని భావిస్తున్నారు. అయితే ఒక విమానాన్ని ఇన్ని వేల  సంవత్సరా ల  నుంచి బయటకు తీయలేక పోతున్నారా అనేది ప్రశ్న ఉద్భవించ వచ్చు. అయితే టైం విల్ అనేది పూర్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థతో అనుసంధానమై  ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎవరైనా అడుగుపెడితే వారు అదృశ్యమై పోతార‌ట‌.
– నరసింహా మూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *