సందేశ తరంగిణి

దేవుళ్ళు ఎంతమంది ? వివిధ మతములు దైవములు ఎట్లు ఏర్పడినవి ? ఒక మతము వాడు ఇంకొక మత గ్రంధముల జ్ఞానసారాంశమును అనుసరించవచ్చా ?

కులము,మతము మనుషులను విడదీస్తుంది [వేరుచేస్తుంది ].  ధర్మము ఆత్మజ్ఞానము  కలుగచేస్తుంది. మనుషులను కలుపుతుంది. ఒకొక్క ప్రాంతముల వాతావరణము ,భావములు ,పుట్టుపుర్వోతరములను బట్టి ఒక్కోక్క మతము ఒక్కోక్క కులము ఉధృబించినవి తప్ప  దైవము  నిర్ణయించినవి ఎంత మాత్రము కావు. ఎంతోమంది దైవములు లేరు. ఎన్నో ధర్మములు  సత్యములు లేవు . ఒకే  దైవము, ఒకే ధర్మము, ఒకే సత్యము, ఒకే  జీవి. నీ దేశములో నీ రాజు [నాయకుడు ] గొప్పవాడు . మరొకదేశములో  అచ్చటి రాజు లేక  [నాయకుడు ] గొప్పవాడు . మా రాజు గొప్పవాడు . మారాజు  గొప్పవాడు అని  ఒకరి నొకరు  వాదోపవాదములతో  కాలయాపన  కాదు   చేసుకోవలసిది. నీవు  ఎంతటి  గొప్పవాడవో  నిర్ణయించుకోవాలి. ఆ విషయమును  తేలిసుకోనక, గ్రహించుటకు ప్రయత్నించక  ఆ గ్రంథములను ధూషణము  చేయువాడు నూతిలో నున్న కప్ప నూతినే మహా  ప్రపంచమునుకోనట్టు వారి ఆత్మ వినాశమునకు తోడ్పడును తప్ప వారు  ఏ మాత్రము వికసింపజాలరు.

తెలిసియు, ధనమానములకు ఆశించియు. ఇది  యే వృత్తిగా  యెంచి  ఇతరులను   మోసగించువారు  తమ్ము  తామే  మోసగించుకొనువారమగుధమును  సంగతి  మరచినవారే . ఇతరుల దోషము , పాపమున కూడా పొంది ఆధోగతి పాలగుచున్నారనుటలో అతిశయోక్తిగాదు.

తల్లికి  అన్నపానములనీయనివాడు పిన తల్లికి చీర పెట్టినట్లు చేయక ముందు నీవు  నీ  పుట్టుకతో  యున్న దైవజ్ఞుల  గ్రంధములలోని సారాంశము  గ్రహించు. తరువాత ఇతరుల గ్రంధములలో  ఉన్న విషయములకు  ప్రయత్నించి  నీ  ఆత్మకు గోచరించు ,సూచించు  మంచి  విషయములను  తీసుకొని అనుసరించు. ఎవరిని, ఏ  జీవిని   ధూశింపకు,  నిందిచకు ,చులకనగా  చూడకు  ముందు  నిన్నునీవు  తెలుసుకో ,తరువాత  అంతా నీకే  తెలుస్తుంది  ప్రతిజీవిలోను, వస్తువులలోను , దాగియున్న  భగవానుని  చూడగలవు . ఆనందింపగలవు .ఆనందింపచేయగలవు కూడా ,భగవానునికి  నామముతోను ,రూపముతోను  పనిలేదు ,మార్గములు  వేరువేరు  కాని గమ్యం  ఒకటే  యనుకుట్లు నీవు  ఏ  నామము  పెటుకున్నను. ఏ రూపమును నిర్మించుకున్నను .వేటితోను పనిలేదు  భగవానుడు ప్రత్యక్షంగా  ఒకే  ప్రదేశమునకు పరిమితమై  జన్మించుట కల. జన్మించినవసరం లేదు.కాని దైవజ్ఞులను జన్మిమంప చేయును.కనుక  వారిని దైవముగా, దైవత్వం, ,ఆత్మ తత్యముగల వారిగా నమ్మి  హృదయంతరాళమునందు వారియొక్క  సందేశములను  ప్రతిష్ఠించుకొని , మనో వాక్య    ,కర్మలచే త్రికరణ శుద్ధిగా ఆచరించవలెను ,దైవత్యము కలవాడే  దేవుడు, బ్రహ్మజ్ఞానము  కలవాడే  బ్రహ్మనుడని  భగవద్గీతలో నినదించినట్లు దైవజ్ఞుల
ఆజ్ఞలను పాటించాలే  తప్ప వారిని పాగిడినంత మాత్రమున వారి పేరు చెప్పి  మనము  ధనము  ఖర్చు  పెట్టినంత  మాత్రమున  ఏమియు  ఫలితము  లేదు . కంటికి  కనబడు  నీ  ఇంటిలోనే  సోదరుడు  దిక్కుదోచని స్థితిలో  వున్నపుడు  నీవు  అతనికి  సహాయపడనపుడు  కంటికి  కనిపించని  దేవుడిని  చూడలేవు . ఆయన తత్వమును   గ్రహించి  ధర్మముగా  నడుచుకొనలేవు .

                                                                         –  పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *