అష్టాదశ శక్తి పీఠాలు

ఈ సర్వసృష్టికి మూల రూపిణి ఆది పరాశక్తి, ఆమె పాదధూళి నుండే ఈ బ్రహ్మాండం,చెట్లు,చేమలు,జీవరాశి,పర్వతాలు,నదులు మొదలైన సమస్తం ఆవిర్భవించాయి.ఈ సృష్టి అంతా ఆమె స్వరూపమే.సృష్టి, సర్వం జగదీశ్వరిమహిమే.
అఖండ భారతదేశం లో భూభాగాన 108 శక్తి పీఠాలు వెలిశాయి. వీటిలో 16 మహాశక్తి పీఠాలు, 51 శక్తిపీఠాలు మిగిలినవి ఉపశక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.  మహాశక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు.
వీటిలో మొదటిది శ్రీలంక లో ఉండగా, మిగిలిన 17 మహాశక్తి పీఠాలు భారతదేశంలోనే ఉన్నాయి.దక్షిణ భారతదేశంలో 6 మహాశక్తి పీఠాలు,ఉత్తర భారతదేశంలో 11 మహాశక్తి పీఠాలు ఉన్నాయి.
లంకాయాం   శాంకరిదేవి  –  కామాక్షి కాంచి కపూరే
ప్రధ్యుమ్నే శృంఖలాదేవి  – చాముండి క్రౌంచ పట్టణే
అలంపురి  జోగులాంబా   –     శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే   మహాలక్ష్మి    –   మాహుర్యే ఏకవీరికా ||
ఉజ్జయిన్యాం  మహాకాళి –  పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి  –  మాణిక్యా దక్షవాటికే |
హరిక్షేత్ర కామరూపా   –   ప్రమాగే మాథవేశ్వరీ
జ్యాలాయం వైష్ణవీదేవి  –  గయా మాంగళ్య గౌరికా ||
వారణస్యాం  విశాలక్ష్మి –  కాశ్మీరేత సరస్వతీ…
దేవి మూడు రూపాలకు సంకేతం ‘ఐం క్లీం హ్రీం’ మూడు బీజాక్షరాలు,ఐం బీజాక్షరాన్ని సారస్వత బీజమంటరు.ఇది మహాసరస్వతికి సంకేతం,క్లీం బీజాన్ని కామరాజు బీజమంటరు.ఇది మహాలక్ష్మికి సంకేతం.హ్రీం బీజం మాయా బీజమని అంటారు.ఇది శక్తి స్వరూపిణియైన శ్రీ మహాకాళికి సంకేతంగా పిలువబడుతుంది.
అమ్మవారి పేర్లు అనంతం, రూపాలు అనేకం,అమ్మవారు భక్తులకు విద్యనిస్తుంది,ధనాన్నిస్తుంది,చైతన్యాన్నిస్తుంది, చివరిగా అఖండ ఙ్ఞానాన్నిప్రసాదిస్తుంది. ఉపాసకులకు పెన్నిధిగా ఈ భువి మిడియా శక్తి క్షేత్రాలు వెలిశాయి.

1.శ్రీ శాంకరీ దేవి – ట్రింకోమలి – శ్రీలంక
2.శ్రీ కామాక్షి దేవి – కంచి – తమిళనాడు
3.శ్రీ శృంఖలా దేవి –  ప్రద్యుమ్నం – పశ్చిమబెంగాల్
4.శ్రీ చాముంఢేశ్వరి దేవి – మైసూర్ – కర్ణాటక
5.శ్రీ జోగుళాంబ దేవి – అలంపూర్ – ఆంధ్ర ప్రదేశ్
6.శ్రీ భ్రమరాంబికా దేవి – శ్రీశైలం – ఆంధ్ర ప్రదేశ్
7.శ్రీ మహాలక్ష్మి దేవి – కొల్హాపూర్ – మహారాష్ట్ర
8.శ్రీ ఏక వీరికా దేవి – మాహూర్ – మహారాష్ట్ర
9.శ్రీ మహంకాళీ  దేవి – ఉజ్జయినీ – మధ్యప్రదేశ్
10.శ్రీ పురుహూతికా దేవి – పిఠాపురం – ఆంధ్ర ప్రదేశ్
11.శ్రీ గిరిజా దేవి – జాజ్ పూర్ – ఒరిస్సా
12.శ్రీ  మాణిక్యాంబా దేవి – ద్రాక్షారామం – ఆంధ్ర ప్రదేశ్
13.శ్రీ కామరూప దేవి – గౌహతి – అస్సాం
14.శ్రీ మాధవేశ్వరి దేవి – ప్రయాగ – ఉత్తర్ ప్రదేశ్
15.శ్రీ  వైష్ణవి దేవి – జ్వాలాముఖీ – హిమాచల ప్రదేశ్
16.శ్రీ మాంగళ్యగౌరి దేవి – గయ – బీహార్
17.శ్రీ విశాలాక్షి దేవి – వారణాసి – ఉత్తర్ ప్రదేశ్
18.శ్రీ  సరస్వతి దేవి – శ్రీనగర్ – కాశ్మీర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *