శ్రీ శారదా దేవి సూక్తులు

*పనులు చెయ్యకుండా ఉంటే మనస్సు ఎలా ఆరోగ్యంగా ఉంటుంది? రోజంతా ధ్యానం చేయడం సాధ్యమవ్వదు. కాబట్టి ఏదో ఒక పని చేయాలి. అది మనస్సును సన్మార్గంలో ఉంచుతుంది.
*ముఖ్యమైనది మనశ్శాంతి. ప్రతి ఒక్కరికి కావలసింది మనశాంతి మాత్రమే.
*కోరికలే అన్నింటికీ కారణం.కోరికలు లేనివారికి ఏ బంధమూ లేదు.
*మలినమైన మనస్సుతో ఉన్న వ్యక్తే ఇతరుల మనస్సులోని మలినాన్ని చూస్తూ తప్పులు వెతుకుతాడు.ఇతరుల దోషాలను వేలెత్తి చూపినందువల్ల ఏమైనా మార్పు కలుగుతుందని అనుకుంటున్నావా? అది నీకే హాని కలిగిస్తుంది.
*సోమరితనాన్ని వీడి జపధ్యానాలు క్రమం తప్పక ప్రతి ఒక్కరూ అనుష్టించాలి.
*“ఎప్పుడూ చురుగ్గా ఉండాలి. పనిలేకుండా ఎప్పుడూ ఉండరాదు.పనిచేయక ఖాళీగా సమయం గడిపితే అనవసరమైన ఆలోచనలన్నీ మనస్సులో ఉద్భవిస్తాయి” అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
*సమయం,సందర్భాన్ని అనుసరించి ప్రవర్తనను మార్చుకోవాలి.
*తప్పులు చేయడం మానవ సహజం. వాటిని పట్టించుకోనవసరం లేదు.నిరంతరం ఇతరుల తప్పులను చూడడం వలన చివరికి నేర శోధకులుగా తయారవుతారు. అలా చేస్తే, అది వారికే హానికరం.
*మారే పరిస్థితులకు అనుగుణంగా మనం సర్దుకుపోవాలి.
*చెడు ఆలోచనలతో సమయం వృధాచేయకుండా, ఏదో ఒక పనిచేయడం మంచిది. మనస్సుకు కొంత స్వతంత్రం ఇస్తే అది విపత్కరమైన పరిస్థితులను సృష్టిస్తుంది.
సేకరణ: bhakthitoday.com team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *