ఈ వారం రాశి ఫలాలు (May17th – May23rd @2020)

మేషం(March21 – April20):
ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య వివాదాలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఆర్ధికంగా ఈ వారం అనుకూలముగా ఉంటుంది. వ్యాపారస్తులు ఒడిదొడుకుల నుండి బయటపడతారు. దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు.

వృషభం(April21 – May21):
మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. మనో నిబ్బరంతో వ్యవహరించండి. రవాణా వ్యాపారం చేసే వారికీ మంచి అవకాశాలు వస్తాయి. సినిమా రంగములో వారికి అంతగా అనుకున్న అవకాశాలు రావు.

మిధునం(May22 – June21):
మీ చెడు అలవాట్లు వలన ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడతారు. విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవుతారు. మహిళా వ్యాపారవేత్తలు విజవంతముగా ముందుకు  వెళ్ళతారు. రోజువారీ కార్యక్రమాలకు ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది.

కర్కాటకం(June22 – July22):
సంతానం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు వున్నాయి. ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు స్దాన చలనము చెందుతారు. దైవ సంబంధిత కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. విదేశీ ప్రయాణాలు ఇప్పట్లో ముందుకు వెళ్లవు.

సింహం(July23 –August23):
వివాహా ప్రయత్నాలు ఆశాజనకంగా ముందుకు వెళ్ళతాయి. కోర్ట్ కేసులు చాలా కాలం వాయిదా పడతాయి. సృజనాత్మక రంగములో వారికి మంచి ప్రోత్సహాం లభిస్తుంది. స్నేహితులతో అనవసరముగా వాదించకండి, సర్డుకపోవటం మంచిది అన్ని విధాలా..

కన్య(August24 – Sept22):
కుటుంబం అంతటికి సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను వింటారు. దూరపు ప్రయాణాలు చేసే అవకాశాలు వున్నాయి, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళటం అవసరము. మహిళలు ఆరోగ్య విషయములో డాక్టర్స్ ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలి.

తుల(Sept23 – Oct23):
మీరు చేపట్టిన ప్రతి పని ఈ వారంలో విఘ్నాలు లేకుండా ముందుకు వెళతాయని చెప్పవచ్చు. అనుకోని ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు. స్నేహితులతో ఉల్లాసముగా గడుపుతారు. ప్రతికూలమైన విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి.

వృశ్చికం(Oct24 – Nov22):
చేసిన ప్రయత్నాలు అనుకున్న విధముగానే సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు పడిన శ్రమకు తగిన గుర్తింపు వచ్చే సమయం వచ్చిందనే చెప్పాలి. కొన్ని ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. మహిళలు శుభవార్త వింటారు.

ధనస్సు(Nov23 – Dec21):
పని ప్రారంభించేటప్పుడు మంచి సమయము చూసుకొని, పెద్దల సలహాలతో ప్రారంభించండి, అంతా మంచే జరుగుతుంది. హోటల్ బిజినెస్ చేసే వారికి ఈ వారము నుండి ఆశాజనక పరిస్థితులు వస్తాయి. విశ్వాసముతో అడుగు వేయండి..

మకరం(Dec22 – Jan20):
టీచర్స్ పూర్వ విద్యార్థుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. సినిమా పరిశ్రమలోని వారు ఒత్తిడికి లోను అవుతారు. వ్యాపారస్తులకు కుటుంబ సభ్యుల నుండి ఆర్ధికంగా సహకారము లభిస్తుంది. రైతులకు ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ వారములో.

కుంభం(Jan21 – Feb18):
పనులు కొంచం శ్రమతో పూర్తి అవుతాయి, నిరాశ పడకుండా పట్టుదలతో ప్రయత్నించండి. దాంపత్య జీవితములో చిన్న చిన్న మనస్పర్థలు తొలగి ఉల్లాసముగా గడుపుతారు. బ్యాంకు నుండి లోన్ మీరు అనుకున్న విధముగానే సకాలములో వస్తుంది.

మీనం(Feb19 – March20):
మీ వ్యక్తిగత జీవితము కోసం సమయాన్ని కేటాయిస్తారు. ప్రేమికులకు కుటుంబ సభ్యుల నుండి సహకారము లభిస్తుంది. మీడియా రంగములో వారికి మంచి ప్రోత్సహాము లభిస్తుంది. చిన్న పిల్లల ఆరోగ్యములో ముందు జాగ్రత్తతో వుండండి

– by bhakthitoday.com team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *