ఈ వారం రాశి ఫలాలు (May24th – May30th @2020) Your Weekly Horoscope

మేషం(March21 – April20):
వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. రావాల్సిన బకాయిలు సకాలములో రావటం వలన ఎప్పటినుండో ఉన్న ఒత్తిడి నుండి బయట పడతారు. స్త్రీలు పుట్టింటి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు తమ కెరీర్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం(April21 – May21):

దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఎలక్ట్రికల్ బిజినెస్ చేసే వారు కొన్ని నూతన వ్యాపార అవకాశాలను అందుకుంటారు. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కోర్ట్ వ్యహారాలు సానుకూలంగా ఉండవు. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

మిధునం(May22 – June21):

మనోబలముతో మీకు ఎదురు అయ్యే ఆటంకాలను ఎదురుకొని ముందుకు వెళతారు. దైవ సంబంధిత కార్యక్రమాలకు మీ వంతు ఆర్ధిక సహాయము చేస్తారు. మిత్రుల నుండి ఒక పనిలో మంచి సహకారము లభించటం మీకు ఈ వారములో పెద్ద ఊరట లభిస్తుంది..

కర్కాటకం(June22 – July22):

కోరికలు నెరవేరతాయి. రాజకీయ నాయకులు సమస్యలను సమరస్యముగా పరిస్కరించుకుంటారు. అందరితో మంచి రిలేషన్స్ ని ఏర్పరచుకుంటారు. అనవసర ఖర్చులకి దూరముగా వుండండి. ప్రయాణాలు అనుకున్న విధముగా జరిగే అవకాశాలు లేవు.

సింహం(July23 –August23):
పని చేసే ప్రదేశములో తోటి ఉద్యోగులతో విభేదాలు వస్తాయి. విమాన ప్రయాణాలు అలసటికి గురి చేస్తాయి. వారాంతములో స్నేహితులతో కొన్ని ముఖ్యమైన పనుల గురించి చర్చిస్తారు. మహిళలు బిజినెస్ పరముగా నూతన అవకాశాలను అందుకుంటారు.

కన్య(August24 – Sept22):

అభివృధికి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురు అయినా సానుకూలంగా అడుగులు వేస్తారు. న్యాయవాదులకి కోర్ట్ కేసుల్లో అనుకూల తీర్పులు వస్తాయి. ట్రావెల్ బిజినెస్ చేసే వారు పరిస్థితులు మారటానికి కొంత సమయం వేచి చూడక తప్పదు.

తుల(Sept23 – Oct23):
చేసే ప్రయత్నాలకు ఇంట్లోవారి సహకారము లభిస్తే అంతా మంచి జరుగుతుందని తెలుసుకొని వారి సలహాలు తీసుకోండి. చక్కటి ప్రణాళికలతో మాత్రమే ఉత్తమ ఫలితాలను పొందుతారు. బంధువుల ఆదిత్యము స్వీకరిస్తారు ఈ వారములో.

వృశ్చికం(Oct24 – Nov22):

ఎప్పటినుండో వస్తుంది అనుకున్న ధనము ఈ వారములో మీ చేతికి వచ్చే అవకాశాలు వున్నాయి. విద్య సంస్థలు నడిపే వారు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళతారు. తరచూ వేధించే ఆరోగ్య సమస్యల నుండి శాశ్వతముగా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు(Nov23 – Dec21):
మిత్రులతో ఉన్న విభేదాలకు ఫుల్స్టాప్ పెడతారు. గతములో జరిగిన లోపాలను పెద్దల సలహాలతో సరిదిద్దుకుంటారు. మీరు మొహమాటం పడకుండా వ్యవహరించండి, లేకపోతే దారినపోయే వ్యవహారాలు మీకు తలా నొప్పిగా మారతాయి.

మకరం(Dec22 – Jan20):
ప్రారంభములో కొంత చికాకులు ఎదురు అయినా బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. స్త్రీలు ఆరోగ్య విషయములో తగిన జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి నూతన ప్రాజెక్ట్స్ ప్రారభించటానికి ప్రయత్నాలు చేస్తారు.

కుంభం(Jan21 – Feb18):
మీరు ఎప్పటినుండో అనుకుంటున్న ఒక పనిని ప్రారంభించాలని గట్టిగా నిర్ణయము తీసుకుంటారు. యువత ఆశయాలు కొన్ని నెరవేరే సమయము వచ్చింది. స్వయం వుపాధి చేసుకొనే వారి కష్టం ఫలించి జీవితములో మరొక మెట్టు ఎక్కుతారు.

మీనం(Feb19 – March20):
దంపతుల మధ్య అపార్ధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహనంతో వుండండి ఇరువురు. ఆర్థికంగా కొంత ఇబ్బంది వున్నా పనులు అనుకున్న సమయానికి పూర్తీ అవుతాయి. పెద్దవారు ఆత్మీయులతో సరదాగా గడిపి పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు.
by bhakthitoday.com team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *