ఈ వారం రాశి ఫలాలు (june21st – june27th @2020)

ఈ వారం రాశి ఫలాలు (june21st – june27th @2020)
Your Weekly Horoscope

మేషం(March21 – April20):
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సంబంధ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రముఖులతో మీకు ఉన్న పరిచయాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురు అయినా అధిగమించి ముందుకు వెళతారు.

వృషభం(April21 – May21):
వృద్ధుల ఆరోగ్యము కొంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. పరిస్థితులను బట్టి వృత్తి, వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోని ముందుకు వెళ్ళండి. కొత్త వ్యక్తుల పరిచయము మీ ఆలోచన ధోరణిలో మార్పుకి కారణము అవుతుంది. ఆలోచించి అడుగు వేయండి.

మిధునం(May22 – June21):
కొద్దిపాటి ఆటంకాలు ఎదురు అయినా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆందోళన చెందకుండా మీ తెలివితో ప్రణాళికాబద్దముగా ముందుకు వెళ్ళండి. దూరపు ప్రయాణాలు మిత్రులతో కలిసి ప్రయాణిస్తారు.

కర్కాటకం(June22 – July22):
మీరు చేస్తున్న వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు. అయినవారితో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకోని విధముగా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

సింహం(July23 –August23):
కొన్ని విషయాలలో మీరు తీసుకొన్న నిర్ణయాలపట్ల కుటుంబసభ్యులు అభ్యంతర పెడతారు. వ్యాపారాలు గతములో పోలిస్తే కొంత లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకులు సమాజములో కీలకంగా ఉండి ప్రజల అభిమానము పొందుతారు.

కన్య(August24 – Sept22):
మిత్రుల నుండే వచ్చే సమాచారం మీకు లాభదాయకంగా మారుతుంది. మీడియా రంగములో వారికి ఆర్ధికంగా ఎదిగే నూతన అవకాశాలు ఎదురు వస్తాయి. విద్యార్థులు కొత్త కోర్స్ లు నేర్చుకోటానికి ఆసక్తి చూపెట్టి, మంచి భవిష్యత్తుకు అడుగులు వేస్తారు.

తుల(Sept23 – Oct23):
మహిళలు వృత్తి, ఉద్యోగాలలో మరింత ఉన్నతి పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పనుల వలన ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సహాకాలు లభించటం వలన నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

వృశ్చికం(Oct24 – Nov22):
గత వారము నుండి మీకు వాయిదా పడుతున్న పనులని ఎప్పుడు విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకోనివిదంగా పురోభివృద్ధి సాధిస్తారు. దూరపు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి రావచ్చు. ఆరోగ్యపట్ల తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి.

ధనస్సు(Nov23 – Dec21):
వారము ప్రారంభములో ధన వ్యయము, ఆరోగ్య భంగము కలగవచ్చు. జాగురూకతతో వ్యవహరించండి. ప్రభుత్వ కాంట్రాక్ట్స్ చేసే వారు పెద్దల సహాయముతో నూతన పనులను దక్కించుకుంటారు. పెళ్లికాని వారికి వివాహా ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మకరం(Dec22 – Jan20):
అనుకున్న లక్ష్యాలను సాధించటానికి తగిన కార్యాచరణ రూపుదిద్దుకుంటారు. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు వస్తాయి. ప్రైవేట్ విద్యారంగములోని వారికి అనుకోని మార్పులు సంభవించి కొంత అయోమయ పరిస్థితులు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కుంభం(Jan21 – Feb18):
మీ మనసులోని మాటలను ప్రియమైనవారితో పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు లావాదేవీల్లో అధిక జాగ్రత వహించి కార్యకలాపాలను కొనసాగించాలి. కొందరివల్ల స్వల్ప విఘ్నాలు ఎదురు అయినా పెద్ద ఇబ్బంది ఉండదు.

మీనం(Feb19 – March20):
శ్రద్హగా పనులు ప్రారంభించండి, అదృష్ట యోగము వుంది. ఎప్పటినుండో వేధిస్తున్న ఆరోగ్య సమస్య నుండి ఉపశమనము లభిస్తుంది. కార్యసాధనలో ఆటంకాలు ఎదురు అయ్యినా పట్టించుకోకుండా మీ ప్రయత్నాలను ముందుకు కొనసాగించండి.

by bhakthitoday.com team

LEARN ASTROLOGY – KP అడ్వాన్సుడ్ ఆస్ట్రాలజీ నేర్చుకోండి – సర్టిఫికేట్ కోర్స్  Learn Astrology | Soul Centric

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *