ఈ వారం రాశి ఫలాలు (May3rd – May9th @2020)

మేషం(March21 – April20):
మంచి పనులతో అభివృద్ధి సాధిస్తారు. స్త్రీలు ఆరోగ్య విషయములో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు వున్నాయి. వస్త్ర రంగములో వారికీ అనుకోని నష్టాలు రావచ్చు. విద్యార్థులు తీసుకొనే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి.

వృషభం(April21 – May21):
ఆర్ధిక అంశాలు అనుకూలముగా ఉంటాయి. దైవ సంబంధిత కార్యక్రమానికి పెద్దలతో చర్చించి తగు విరాళము ఇస్తారు. దూరపు బంధువులు మీకు ముఖ్యమైన సమాచారం అందిస్తారు. బ్యాంక్లో లోన్ కోసం చేసే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు లేవు.

మిధునం(May22 – June21):
అనుకోని శుభవార్తలు వింటారు. ఎప్పటినుండో చేస్తున్న కార్యములో ముందుకు వెళ్లే అవకాశాలు మెండుగా వున్నాయి. గత అనుభవాలను గుర్తు చేసుకొని ఆర్ధిక వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవటం రాబోయే ఆపదల నుండి మీకు రక్షణ కల్పిస్తుంది.

sponsored link:
Astrology Horoscope Telugu Single Page Software
https://amzn.to/2SxkLoJ

కర్కాటకం(June22 – July22):
ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. వైద్య వృత్తిలోని వారు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. కుటుంబ సహకారముతో బయటపడాలి. కొత్తగా వ్యాపారము ప్రారంభించిన వారు పట్టుదలతో ప్రయత్నిస్తే కానీ విజయం సాధించలేరని గుర్తుంచుకోవాలి.

సింహం(July23 –August23):
పోటీ పరీక్షలకు సిద్ధము అవుతున్న విద్యార్థులకు పరిస్థితులు సహకరించక నిరాశకు గురి అవుతారు. కొన్ని నిర్ణయాలను ఈ వారములో వాయిదా వేసుకోవటం వలన తరువాత మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం అవసరం.

కన్య(August24 – Sept22):
క్రమం తప్పకుండా ఇంట్లో మీ ఇష్ట దైవాన్ని పూజించండి. వుద్యోగం కోసం చేసే మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురు అయ్యే అవకాశాలు వున్నాయి. కొన్ని ఒత్తిడిలు మిమ్మల్ని, మీ దృఢ సంకల్పాన్ని ఏమి చేయలేవు. ధైర్యముగా వుండండి.

sponsored link:
Astrology Horoscope Telugu Single Page Software
https://amzn.to/2SxkLoJ

తుల(Sept23 – Oct23):
స్నేహితులతో వచ్చే చిన్న చిన్న విభేదాలను తెగేదాకా లాగకుండా సామరస్యముతో వ్యవహరించండి. అందరితో నిదానముగా నడుచుకోవటం వలన మంచి సంభందాలు ఏర్పడతాయి. వారము మధ్యలో పెద్దల ఆరోగ్యము ఆందోళన పరచవచ్చు.

వృశ్చికం(Oct24 – Nov22):
రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి. మానసిక దృఢత్వముతో వుండండి. ఆర్థికంగా గత కాలము కన్నా కొంత మెరుగు అయ్యే అవకాశాలు వున్నాయి. మీరు చేసే పనులకు తగ్గ ఫలితాలు మాత్రం రావు. నిరాశ చెందకుండా చేసుకుంటూ వెళ్ళతారు.

ధనస్సు(Nov23 – Dec21):
సోదరుల నుండి కొంత వ్యతిరేకతను ఎదురుకొంటారు.. పెళ్లి కాని వారు వివాహాము కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వవు. వ్యాపారస్తులు ఒడిదుడుకులు చూస్తారు. వస్త్ర వ్యాపారాలకు ఈ వారము కూడా నిరాశే ఎదురు అవుతుంది.

sponsored link:
Astrology Horoscope Telugu Single Page Software
https://amzn.to/2SxkLoJ

మకరం(Dec22 – Jan20):
పెద్దల సలహాలతో ముందుకు వెళ్లితే బాగుంటుంది. చేసే పని మీద శ్రద్ద పెట్టి పని చేయటం వలన యువకులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయంలో ఉన్న వారికి ప్రజల నుండి మంచి ఆదరణ లభించి సంతృప్తిగా వుంటారు.

కుంభం(Jan21 – Feb18):
స్థిరాస్తి వివాదాలను వాయిదా వేసుకుంటారు కొంతకాలం పాటు. మీరు స్వయముగా ఆలోచించి మీకు నచ్చిన తీసుకొనే నిర్ణయాలే మంచి ఫలితాలు ఇస్తాయని గుర్తుపెట్టుకోండి. అనవసర ఖర్చులను పెట్టకపోవటం అన్ని విధాలా ఉత్తమము.

మీనం(Feb19 – March20):
వ్యాపారములో అనుకూలఫలితాలు వస్తాయి. విందు, వినోదాలు, ఆడంబరాలకు దూరముగా వుండండి. ఇతరుల విజయాలను చూసి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. రావాల్సిన డబ్బులు సమయానికి అందక కొంత ఆందోళన పడతారు.

-by bhakthitoday.com team

SPONSERD AD:
పెళ్లి సంబంధం చూస్తున్నారా? మీ పెళ్లి ప్రకటనను telugumatrimonyinfo.com లో ఇవ్వండి – మంచి match ని మీరు కోరుకున్న విధముగా పొందండి. తక్కువ ఖర్చుతో తొందరగా పెళ్లి సంబంధాన్నిపొందే మార్గము.*ఎటువంటి marriage beauro ల ప్రమేయము లేకుండా, డైరెక్టుగా మీరే సమాచారాన్ని పొందవచ్చు.*మొదటిసారిగా online లో తెలుగు వారి కోసము రూపొందించిన website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *