ఈ వారం రాశి ఫలాలు (June14th – June20th @2020)

ఈ వారం రాశి ఫలాలు (June14th – June20th @2020)

మేషం(March21 – April20):
ప్రారంభములో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. మహిళలు ఆరోగ్యము పట్ల మరింత శ్రద్హ వహించాలి. సకాలములో వైద్యునిని సంప్రదించటం అన్ని విధాలా మంచిది.

వృషభం(April21 – May21):
కోర్టు పనులు సానుకూలంగా జరుగుతాయి ఈ వారములో. ఆర్ధిక సమస్యల నుండి కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు వెళ్ళతాయి. అనుకోని దూరపు ప్రయాణాలు వస్తాయి.

మిధునం(May22 – June21):
దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి. చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీకు కానీ విషయాలలో ఎక్కువ జోక్యం చేసుకోకుండా తెలివిగా వ్యవహరించండి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

కర్కాటకం(June22 – July22):
వైద్య వృత్తిలో ఉన్న వారు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. వ్యాపారస్తులు కొన్ని సమస్యలును తోటి మిత్రుల సహకారముతో పరిష్కిరించుకుంటారు. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసముగా గడుపుతారు. శుభకార్యములో పాల్గొంటారు.

సింహం(July23 –August23):
మీరు అనుకున్న పనులు అయ్యేదాకా ఈ వారములో గట్టిగా శ్రమిస్తారు. జీవిత భాగస్వామి నుండి మంచి ప్రోత్సహాము లభిస్తుంది. రాజకీయ నాయకులు అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆలస్య వివాహాము వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి.

కన్య(August24 – Sept22):
కొత్తగా వ్యాపారము ప్రారంభించే వారు వాయిదా వేసుకోవటం మంచిది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి నూతన అవకాశాలు ఎదురు వస్తాయి. మహిళలు తమ వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. పిల్లల ఆరోగ్య పట్ల శ్రద్ద వహించాలి.

తుల(Sept23 – Oct23):
మీరు పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు ఆలస్యము అయినా చివరికి పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్ళతాయి. వస్త్ర వ్యాపారములో వారికి అనుకోని ఆర్డర్స్ వస్తాయి. వైద్యవృత్తిలో వున్నవారికి కొన్ని మార్పులు జరుగుతాయి.

వృశ్చికం(Oct24 – Nov22):
చిన్న చిన్నగా ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు. కొత్త బిజినెస్ గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నతికి చేరే మార్గాలను అన్వేషిస్తారు. రచయతలు తమ ప్రతిభతో కొత్త అవకాశాలను అందుకొని తమ వృత్తిలో ఎదుగుతారు.

ధనస్సు(Nov23 – Dec21):
మీరు ఎప్పటినుండో అనుకున్న పనులను ఈ వారములో ప్రారంభిస్తారు. ఆత్మీయులతో ఉన్న చిన్న చిన్న వివాదాలను వదిలేస్తారు. స్థల కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవు. బ్యాంకింగ్ రంగములో వారికీ స్దాన చలనము ఉంది.

మకరం(Dec22 – Jan20):
మీకు ప్రముఖులతో ఉన్న పరిచయాలు మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. యువత నూతన రంగాల్లో రాణిస్తారు. వ్యాపార రంగములో వారు ఆర్ధిక సమస్యలు ఎదురుకొనే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ కోసము ప్రయత్నిస్తారు.

కుంభం(Jan21 – Feb18):
దూరప్రాంతాల నుండి వచ్చే సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దూరముగా వుండండి. ఉద్యోగ ప్రదేశములో ఇబ్బందికర వాతారణము ఎదురు అవ్వవచ్చు. దూకుడుగా వెళ్లకుండా సంయనముతో వుండటము ఉత్తము.

మీనం(Feb19 – March20):
రావలసిన సొమ్ము సకాలములో సమకూరి మీ అవసరాలు తీరుతాయి. సినిమా పరిశ్రము వారు తమ క్రియేటివిటీ కి పదును పెడతారు. భక్తి సంబంధ కార్యక్రమాలకు కొంత విరాళము ఇస్తారు. వృద్దులకు ఆరోగ్యము మెరుగు పడి కుదుట పడతారు.

 by bhakthitoday.com team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *